గ్రామాలలో పంట నష్టం వివరాల సేకరణ* మండల వేవసాయధికారి పి. శ్రావణ కుమారి..
చింతపల్లి మేజర్ న్యూస్ : నల్లగొండ జిల్లా.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కరువు మండలంగా ప్రకటించబడిన చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటలు, పంట నష్టానికి సంబంధించిన వివరాల సేకరణ గురువారం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి పి .శ్రావణ్ కుమారీ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,
వ్యవసాయ శాఖ ఏఈవోలు గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి, పంట నష్టం జరిగిన రైతుల వివరాలు, పంట నమోదుకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.పంట నష్టం జరిగిన రైతులందరూ తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు అందుబాటులో ఉండి, తమ పంట పొలాలను అధికారులకు చూపించి అవసరమైన వివరాలను అందించాలి.
ఇట్టి అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పంట నష్టం వివరాల సేకరణ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు .యాసంగి లో వరికి బదులుగా ఆరుతడి పంటలువేయండి అని అన్నారు..
ఎల్ నీనో ప్రభావం దృష్ట్యా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయని దీనితో వ్యవసాయ బావులు బోర్లలో నీటిమట్టం తగ్గి పంటలేండి పోయే ప్రమాదం ఉంది , కావున రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దని సూచించారు. పంటల మార్పిడి విధానాన్ని అవలంబించి , ఆరుతడి పంటల సాగు పై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. సబ్సిడీ పై పెసర మరియు మినుములు విత్తనాలు అందుబాటులో వున్నాయని కావాల్సిన రైతులు వ్యవసాయ విస్తరణాధికారులని సంప్రదించగలరని కోరారు.