సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- అధ్యక్షుడిగా బలివాడ.మల్లేశ్వరరావు
- ప్రధాన కార్యదర్శిగా కే.సోమసుందర రావు
శ్రీకాకుళం నవంబర్ 5 మేజర్ న్యూస్ :
శ్రీకాకుళం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం స్థానిక శాంతా కల్యాణ అనురాగ నిలయంలో సంఘ అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. గురువారం నూతన అధ్యక్షులు బలివాడ మల్లేశ్వరరావు ఒక ప్రకటనలో పూర్తి వివరాపను వెల్లడించారు. అసోసియేట్ అధ్యక్షులుగా ఎం.ఎస్.ఆర్.ఎస్. ప్రకాశరావు, పి.నరసింహమూర్తి, పి.ఎస్.ప్రసాదరావు, పి.నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ గా, ప్రధాన కార్యదర్శిగా కే.సోమ సుందర రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వి.నాగేశ్వరరావు, కె.రామమోహనరావు, కోశాధికారిగా ఏ.బాబురావు, కార్యదర్శులుగా కే.వెంకటేశ్వరరావు, ఎల్.వి.కె.నందికేశ్వరరావు, ఆర్.సి.హెచ్ పట్నాయకులను, టౌన్ బ్రాంచ్, మహిళా విభాగం, జిల్లా సంఘానికి నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేశారన్నారు. అనంతరం మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజన్లేనని, వారికి ప్రభుత్వం కల్పించిన హక్కులు, సౌకర్యాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి. జగన్మోహనరావు, రాష్ట్ర పెన్షనర్ల సంఘం జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమ నాయుడు తదితరులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సంఘానికి సొంత కార్యాలయ భవనం సాధించేందుకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించాలని, సంఘ కార్యకలాపాల నిర్వహణకు దాతలు సహకరించాలని కోరారు. పి.జగన్మోహన్రావు, సి.హెచ్. పురుషోత్తమ నాయుడు, నిక్కు అప్పన్న, జిల్లా సంఘం గౌరవ అధ్యక్షులుగాను, ఆర్.వి.ఎన్.శర్మ, ఏ.బలరామ కృష్ణారావు ముఖ్య సలహాదారులగ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎం.అప్పారావు, ఎల్.వెంకట్రావు, డీ.జే.మోహన్ రావు, డి.చిరంజీవిరావు, ఏ .లక్ష్మణ్ రావు, కే.గణపతి రావు, బీమారావు, బి.భాస్కరరావు, ఎన్. కోటేశ్వరరావు, ఎంపీ అమరేశ్వర రావు ,ఏ రామేశ్వరరావు, కే.సవరయ్య,వి.వి. బోడయ్య, పి.విశ్వనాథం, ఎస్.నారం నాయుడులు ఉన్నారు.
కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఆర్.వి.ఎన్.శర్మ, పరిశీలకులు త్రినాథ ప్రసాద్, జగన్నాథం తోపాటు, ఎస్.వి.డి.మురళీకృష్ణ, నరసన్నపేట సంఘం నుండి ఎస్, ప్రభాకర్ రావు, యు.లింగరాజు, వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.