telangana
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఆటో కార్మికులకు స్వీట్ల పంపిణీ
కర్మన్ ఘాట్ , మేజర్ న్యూస్ : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దెంది శశిధర్ రెడ్డి అన్నారు. ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆటో కార్మికులకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దెంది శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఆటో కార్మికులు నిత్యం కష్టపడి ప్రజలకు రవాణా సేవలు అందిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, అలాంటి కష్టజీవులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం ఎంతో అభినందనీయమని అన్నారు.పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిర్ణయం హర్షదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విష్ణు, వెంకటేష్, రాజు, జహంగీర్, మహేష్, లక్ష్మణ్ తదితర ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.