BREAKING
అంతర్జాతీయ యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే: సీడీఎస్ రాజా సుబ్రమణి! ఎంటీఎంసీ ఎన్నిక కు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కురుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్ శేఖర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు!

ఈ-ఆటోల ద్వారా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలి --నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

Select Suryaa Now
ఈ-ఆటోల ద్వారా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలి --నగర కమిషనర్ కె.మయూర్ అశోక్
 గుంటూరు  న్యూస్: గుంటూరు నగరంలో ఈ-ఆటోల ద్వారా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, ప్రతి ఆటోకి రూట్ మ్యాప్ అంటించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ శ్యామల నగర్, భాగ్య నగర్, కృష్ణ నగర్, శ్రీనగర్, కాకుమానువారితోట తదితర ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ-ఆటోలకు కేటాయించిన ప్రాంతాల్లో పక్కాగా ఇంటింటి చెత్త సేకరణ చేసేలా పర్యవేక్షణ చేయడానికి సిబ్బందికి విధులు కేటాయించాలని ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. నగరంలో గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ ఉండడానికి వీలు లేదని, కమర్షియల్, వీధి వ్యాపారులు ఎవరైనా రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్ధాలు వేస్తె వారిపై భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని స్పష్టం చేశారు. తుఫాన నేపధ్యంలో డ్రైన్లలో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలు నిల్వకుండా ఎప్పటి కప్పుడు తొలగించాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో నూతన సిసి రోడ్ల నిర్మాణాలను తనిఖీ చేసి, పనుల్లో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తప్పవని, ప్రతి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజన్సీ నుండి సర్టిఫికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఏఈ, కార్యదర్శి తమ పరిధిలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, శ్యాంపిల్స్ తీసి ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. సదరు రిపోర్ట్ ని తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదు చేసి ఉంచాలని ఆదేశించారు. త్రాగునీటి పైప్ లైన్ల లీకులు, రోడ్లకు ప్యాచ్ వర్క్ లను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్ఈ ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ విష్ణు వర్ధన్, డిఈఈలు వెంకట రమణ, చైతన్య, ఎస్ఎస్ లు సోమశేఖర్, సాంబయ్య, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.