andhrapradesh
ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు న్యూస్ : ప్రజలు ఛీ కొట్టినా వైసీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, మిర్చి దొంగ అప్పిరెడ్డిని పరామర్శించడానికి వచ్చి పోలీసులపై దాడి చేయడం హేయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ నసీర్ మండిపడ్డారు. సోమవారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని వైసీపీ ఇంకా తన దౌర్జన్య వైఖరిని మార్చుకోలేదన్నారు. పోలీసులు పచ్చ చొక్కాలు తొడుక్కొని ఉంటే స్థానిక ఎన్నికల్లో
వైసిపి కనీసం పోటీ చేయగలిగేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ ఎమ్మెల్యే నసీర్ ప్రశ్నించారు. నిందితులను పరామర్శించే సంస్కృతి వైసీపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు.19 కేసులు ఉన్న లేళ్ల అప్పిరెడ్డి నిర్దోషి అయితే కోర్టులో నిరూపించుకోవాలని హితవు పలికారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలన్నారు. వైసీపీ అజెండా ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థమైందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పారని అన్నారు. ఓట్లతో నిండి ఉన్న బ్యాలెట్ బాక్స్‌ను అప్పిరెడ్డి అక్రమంగా తన స్వాధీనంలో ఉంచుకున్నారని. బ్యాలెట్ బాక్స్ లపై ఎన్నికల అధికారులు సంతకాలు ఉంటాయనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కేవలం అనుమతి ఉన్న ఒకరిద్దరిని మాత్రమే జైలులోకి అనుమతిస్తారని, సజ్జల రామకృష్ణారెడ్డి , ఆయన అనుయాయులు కాన్వాయ్ మొత్తాన్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని తెలిపారు. అడ్డుకోబోయిన పట్టాభిపురం ఎస్ఐ రామాంజనేయులుపై దాడికి పాల్పడటం దారుణం అన్నారు. సకల శాఖల మంత్రిగా పని చేసిన సజ్జలకు ఆ మాత్రం చట్టం గురించి తెలియదా అని నిలదీశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే వైసిపి అవాకులు చవాకులు పేలుతుందని మండిపడ్డారు. తుఫానులు, ఎల్ నిలో వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితుల దగ్గరకు మాత్రమే వైసీపీ నాయకులు వెళ్తారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో ప్రజలు 95 కూటమికి మద్దతుగా నిలిచారన్నారు. చట్టాలను గౌరవించకపోతే వైసీపీకి తగిన శాస్తి జరుగుతుందని ఎమ్మెల్యే నసీర్ హెచ్చరించారు.