శేఖర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ పరిధిలోని టిఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో పాటు నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా శ్వాసకొస సమస్యతో బాధపడుతున్న శేఖర్ రెడ్డి సోమవారం మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పట్టణ టీడీపీ నాయకులతో కలసి వెళ్లి శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం వారి కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు. ఈ సంతాప కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం గౌడ్, క్రిష్ణ మూర్తి గౌడ్, సుదీర్ కుమార్, నాగరాజు, చంద్రా రెడ్డి, రూపేష్,కృష్ణ రెడ్డి, రెడ్డెప్ప తదితరులు ఉన్నారు..
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్