BREAKING
భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం ఎరువులు కొనుగోలు డిజిటల్ విధానం గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి... పదవి కోసం కాదు.. గ్రామ ప్రగతి కోసమే పోటీ! అభివృద్ధి పనులతో ప్రజల మనసు గెలుస్తా! ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీకృష్ణ, డా. దిలీప్ రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: గత రికార్డులు బద్దలు! రెండోవిడత పల్లెపోరుకు రెడీ విరుచుకుపడనున్న ‘అక్వాన్’ తుఫాన్.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం! పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి 28వ వార్డులో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు : అపూర్వ స్వాగతం పలికిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి. నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్‌ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు

గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి.

Select Suryaa Now
గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు  మరువలేనివి.
  • ఉద్యమ నేతలకు ఘన నివాళి 

తె ర్లాం, సూర్య: జాతీయ గ్రంథాలయ నిర్మాణం కోసం అశువులు బాసిన మహనీయుల త్యాగ ఫలాలు మరువలేనివని విశ్రాంతి మండల విద్యాశాఖ అధికారి ఎం సత్యనారాయణ కొనియాడారు. సోమవారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో సభ్యులుగా చేరండి విజ్ఞానం పొందండి అని పిలుపునిచ్చారు. పుస్తకాలు మీకు నిజమైన నేస్తాలని వాటిని చదివి జీవిత సత్యాలను గ్రహించాలని అన్నారు. పుస్తకమే పరమావధిగా భావించి పుస్తక పఠనం చేయాలని అందుకు సంబంధించి ప్రతిజ్ఞ కూడా చేయించారు. అలాగే  గ్రంథాలయ అధికారి సిహెచ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉద్యమ పోరాట నాయకులు ఎస్ఆర్ రంగనాథన్ పాతూరు నాగభూషణ్ వెంకట రమణయ్య వారి సేవలను స్మరించి వారి ఆశ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. తొలుత ఉద్యమ నాయకుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వారితోపాటు క్రాఫ్ట్ టీచర్ విశ్వేశ్వరరావు స్థానిక సభ్యులు విశ్రాంతి రవి అంగన్వాడి కేంద్రం కార్యకర్త వై శ్రీదేవి పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.