andhrapradesh
శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం
- బోలా శంకరుడు కి పంచామృతాలతో భక్తుల అభిషేకాలు
పూసపాటిరేగ, సూర్య: కార్తీక మొదటి సోమవారం సందర్భంగా మండలంలోని శివాలయాలు మీకు జాబు నుంచే భక్తులతో కిటకిటలాడాయి. శ్రవణా నక్షత్రంతో కూడిన కార్తీకమాస మొదటి సోమవారం సందర్భంగా అరుదుగా వచ్చే ఈ పర్వదినాన్ని ఫార్మా శివునికి ప్రీతికరం అని భక్తుల విశ్వాసం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో శివనామంతో ఆధ్యాత్మికతతో పరవశించిపోయింది. పూసపాటి రేగ లో ఉన్న శివాలయానికి బేకరించే భక్తులు చేరుకొని పంచామృతాలతో కూడిన అభిషేకాలను భక్తులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్లతో పాటు నాగేంద్రునికి ప్రత్యేక దీపాలను వెలిగించడం ద్వారా భక్తులు భక్తి భావాన్ని చాటుకున్నారు. కుమిలి పురాతన ఉమా రామలింగేశ్వర ఆలయంలో భక్తులు మీకు జామునే కాలయానికి చేరుకుని రుద్రునికి ప్రత్యేక పంచామృతాలతో కూడిన అభిషేకాలను నిర్వహించారు. ఆలయంలోకి భక్తులు ప్రవేశించి శివనామ స్తోత్రాలతో మార్మోగింది. చూడమ్మా అగ్రహారం సమీపంలో ఉన్న శివాలయంలో భక్తులు కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అర్ధరాత్రి నుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనంతో పాటు రుద్రునికి భక్తులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. కోనాడలో పురాతన శివాలయంలో భక్తులతో నిండిపోయింది. నది సాగర్ సంగం సమీపంలో ఈ ఆలయం ఉండడంతో వేకువనే నదీ స్నానాలను భక్తుల ఆచరించి ఆలయానికి చేరుకొని రుద్రునికి పంచామృతాలతో కూడిన అభిషేకాలను నిర్వహించారు. అల్లాడ పాలెం లో ఉన్న శివాలయంలో కూడా పరిసర ప్రాంతాలకు చెందినవారు అధిక సంఖ్యలో శివాలయానికి చేరుకొని రుద్రునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. ఆలియా అర్చకులు విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను కూడా అందజేశారు.