BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: కర్ణాటకపై ఉత్తరప్రదేశ్ ఘన విజయం.. సీజన్‌లో తొలి గెలుపు నమోదు! న్యూజిలాండ్‌తో పోరులో భారత్‌కు ఊరట.. బౌలర్ల ప్రదర్శనే ప్రధాన బలం! కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం

ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం!

Select Suryaa Now
ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం!

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:ఆడ శిశువుల రక్షణ, లింగ సమానత్వమే లక్ష్యంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా స్థాయి సలహా కమిటీ (డీఎల్‌ఏసీ) చైర్మన్ డా. కె. ఆనంద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో అల్ట్రాసౌండ్, సోనోగ్రఫీ కేంద్రాలు, జన్యు సలహా కేంద్రాలు, జన్యు ప్రయోగశాలలు, ఇమేజింగ్ కేంద్రాలకు సంబంధించిన దరఖాస్తులను సమీక్షించారు.గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ప్రక్రియల నిషేధ చట్టం–1994 (పీసీపీఎన్‌డీటీ), నిబంధనలు–1996 ప్రకారం కొత్త కేంద్రాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులతో పాటు ఇప్పటికే నమోదైన కేంద్రాల పునరుద్ధరణ దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. చట్టాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డా. కె. ఆనంద్ మాట్లాడుతూ.. గర్భస్థ శిశువు లింగాన్ని తెలుసుకోవడం, లింగ ఎంపిక చేయడం లేదా అందుకు సహకరించడం చట్టరీత్యా నిషేధమని స్పష్టం చేశారు. నమోదు కాని ప్రైవేటు ఆరోగ్య సంస్థలు, అనధికారిక కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ తప్పదని స్పష్టం చేశారు.వైద్యపరమైన అవసరాలకు మాత్రమే చట్టంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అన్ని నమోదిత కేంద్రాలు అనుమతులు, రికార్డుల నిర్వహణతో పాటు ఇతర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో ఆడ శిశువుల రక్షణ, లింగ సమానత్వం కోసం చట్టం అమలుపై జిల్లా స్థాయి సలహా కమిటీ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ అధికారి (సీఐఏ) డా. పవన్ కుమార్ రెడ్డి, పీడియాట్రిషియన్ డా. లింగమూర్తి, గైనకాలజిస్ట్ డా. స్వర్ణలత, జన్యు నిపుణురాలు డా. స్వర్ణలత, జిల్లా ప్రజా సంబంధాల అధికారి, ఎన్‌జీఓ ప్రతినిధి హైమావతి, డిప్యూటీ డెమో వసంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.