BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: కర్ణాటకపై ఉత్తరప్రదేశ్ ఘన విజయం.. సీజన్‌లో తొలి గెలుపు నమోదు! న్యూజిలాండ్‌తో పోరులో భారత్‌కు ఊరట.. బౌలర్ల ప్రదర్శనే ప్రధాన బలం! కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం

కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం

Select Suryaa Now
కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

:పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.ముఖ్యంగా పలివెల గ్రామంలోని ప్రసిద్ధ స్వయంభూ శ్రీ ఉమా కొప్పేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు.మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు.భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ పి.కామేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక క్యూలైన్లు,ఇతర ఏర్పాట్లు చేపట్టారు.కార్తీక తొలి సోమవారం కావడంతో ఆలయమంతా హరహర మహాదేవ,ఓం నమఃశివాయ నామస్మరణలతో మార్మోగింది. భక్తుల రాకతో పలివెల ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.