శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు
వేములపల్లి, మేజర్ న్యూస్ :
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని శ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
*భక్తులతో సందడిగా మారిన దేవాలయ ప్రాంగణం:*
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శెట్టిపాలెం, ఇటిక్యాల గ్రామాలతో పాటు పరిసర గ్రామ ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పెదపంగ సైదులు, మాజీ సర్పంచ్ మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ కంచర్ల సురేందర్ రెడ్డి, ప్రాంత సభ్యులు బంటు శ్రీనుతో పాటు అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.