రెండు బైకులను ఢీ కొట్టిన ఇసుక లారీ, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
సూర్య, జన్నారం : జన్నారం మండలం రాంపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మంచిర్యాల వైపు నుంచి ఇసుక లోడుతో నిర్మల్ కు వెళ్తున్న పది టైర్ల లారీ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఓ బైకును ఢీ కొట్టి, ముందు బాగాన ఉన్న మరో బైక్ ను కొంత దూరం వరకు ఈడ్చుకెళ్ళి వంద గజాల దూరంలో చెట్టుకు ఢీకొని ఆగింది. మొదటి బైకును ఢీకొట్టగా నాయకపు గూడెంకు చెందిన పోషం కు గాయాలు కాగా, హుటాహుటినా స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో పంపించారు. బలంగా లారీ చెట్టుకు ఢీకొనడంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ రమేష్ స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. స్థానిక పోలీసులు శ్రమించి ఆయనను బయటకు తీశారు. డ్రైవర్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.