BREAKING
రామాయంపేటలో 142 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అక్రమ మద్యం రవాణా భగ్నం.. 46 విస్కీ సీసాలు స్వాధీనం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు రోకలిబండతో తలపై బాది దారుణ హత్య. గిన్నిస్ రికార్డు కెక్కిన రెండు నెలల చిన్నారి. చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పురుషులను మించి మహిళా ఓటర్లు! ఎస్.రాయవరంలో నేడు విద్యుత్ అంతరాయం! రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం! సీఎం సభను ప్రతాప్ రెడ్డి అడ్డుకుంటాం అనడం సిగ్గుచేటు ముప్పు గ్రామాల కౌన్సిలర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి ఎస్.రాయవరంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ!

మల్లంగుంట టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా పార్లపల్లి మునికృష్ణారెడ్డి

Select Suryaa Now
మల్లంగుంట టిడిపి సర్పంచ్  అభ్యర్థిగా పార్లపల్లి మునికృష్ణారెడ్డి

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికలలో తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా సర్పంచ్ అభ్యర్థిగాపార్లపల్లి మునికృష్ణారెడ్డిని, వైసిపి పార్టీ మద్దతుదారులుగా అల్లూరి జయచంద్రా రెడ్డి లను  
బరిలో నిలచారు. ఆయా పార్టీల మద్దతు సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయనున్న   వార్డు మెంబర్ల ను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 3,042 ఓటర్లు ఉన్నారు. ఇద్దరు కూడ  స్థానికంగా మంచి పట్టున్న నాయకులు. బుధవారం నుంచి నామినేషన్ల పర్వం తిరుపతి రూరల్ మండలంలో ప్రారంభం కానుంది. టిడిపి మద్దతుదారులైన పార్లపల్లి మునికృష్ణారెడ్డికి మల్లంగుంట గ్రామంతో పాటు పంచాయతీ పరిధిలోని కాలనీలలో మంచి పట్టు ఉంది. కాలనీలలోని ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చిన  ముందుండి సాయం చేసే మనస్తత్వం కలిగిన పార్లపల్లి 

ముని కృష్ణారెడ్డికి  ఒక్క అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపిస్తే మరింత సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆయన పంచాయితీ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పంచాయతీలో మంచి ఆదరణ కలిగిన నేతగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. మరో పక్క కూటమి పార్టీ మద్దతు ఉండడంతో గెలుపు సునాయాసనం అయ్యే అవకాశం ఉందని స్థానిక ఓటర్లు చెబుతున్నారు.

H. Dwaraka, staff reporter,

9705347341