BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

సీఎం సభను ప్రతాప్ రెడ్డి అడ్డుకుంటాం అనడం సిగ్గుచేటు ముప్పు గ్రామాల కౌన్సిలర్లు..

Select Suryaa Now
సీఎం సభను ప్రతాప్ రెడ్డి అడ్డుకుంటాం అనడం సిగ్గుచేటు  ముప్పు గ్రామాల కౌన్సిలర్లు..

గజ్వేల్ ; .సిద్దిపేటలో గురువారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను అడ్డుకుంటమని గజ్వేల్ బీఆర్ఎస్  నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించడం అవివేకమని ఆర్ అండ్ ఆర్ కాలనీ కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలపై ప్రతాప్ రెడ్డి చూపిస్తున్న ప్రేమ అంతా కేవలం రాజకీయ డ్రామా అని, అది పూర్తిగా బూటకమని కౌన్సిలర్లు విమర్శించారుnగత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, ఇప్పుడు సభను అడ్డుకుంటామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు,ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వారు స్పష్టం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోయే భారీ బహిరంగ సభను అడ్డుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని వారు హెచ్చరించారు*.
*ఈ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ కాంగ్రెస్ కౌన్సిలర్లు గూగులోత్ రమేష్, ఉపేందర్ రెడ్డి,నరసింహారెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొండల్ రెడ్డి,నాయకులు గుంటుకు శ్రీనివాస్, సమీర్, ఉమేష్ యాదవ్ ,నరసింహ్మరెడ్డి ,కరుణాకర్ రెడ్డి ,అంజద్,ప్రమోద్ ,యాదగిరి,షషకిల్ ,జహంగీర్ ,హసన్ ,ముంపు గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు*