నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండల
ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా పెరుమా ళ్లపల్లి -2 ఎంపీటీసీ కత్తి కళ్యాణి గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కళ్యాణి పెరుమళ్ళపల్లి నుండి ఏకగ్రీవంగా ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆమెను మండలంలోని టిడిపి కూటమి పార్టీకి చెందిన 30 మంది ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తి ఏకగ్రీవంగా
ఎన్నుకోన్నున్నారు. ముత్యాల రెడ్డి పల్లి లోని ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మొదట కోఆప్షన్ మెంబర్ ఎన్నిక.
అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీగా కత్తి కళ్యాణి బాధ్యతలు చేపట్టనున్నారు. తిరుపతి రూరల్ మండలంలో మొత్తం 40 ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపొందారు. వారిలో తెలుగుదేశం పార్టీ కీ చెందిన 30 మంది అభ్యర్థులు, 9 మంది వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థులతో పాటు ఒకరు ఇండిపెండెంట్ గా గెలుపొందారు. రూరల్ ఎంపీపీ ఎన్నికకు కావలసిన పూర్తి మెజారిటీ తెలుగుదేశం కూటమి పార్టీకి ఉండటంతో ఎన్నిక సజావుగా జరిగే అవకాశం ఉంది. అయితే పూర్తిస్థాయి కూటమి పార్టీకి ఉన్నప్పటికీ ఎంపిటిసి సభ్యులందరినీ పలు ప్రాంతాలలో వారం రోజులకు పైగా ఎంపీపీ అభ్యర్థి కత్తి కళ్యాణి భర్త సుధాకర్, దుర్గ సముద్రం మాజీ ఎంపీటీసీ ఊరిమిండి మునిశేఖర్ నేతృత్వంలో క్యాంప్ నిర్వహించారు.
ఎంపీపీ ఎన్నికకు ఏర్పాట్లు అన్ని పూర్తి :
తిరుపతి రూరల్ మండలంలోని ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీపీ ఎన్నిక, కో ఆప్షన్ నెంబర్ ఎన్నికకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎంపీడీవో జయశ్రీ పూర్తి చేశారు.
ఒకపక్క ఎంపీపీ ఎన్నిక... మరో పక్క సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ..
ముత్యాల రెడ్డి పల్లి లోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం రోజున రూరల్ ఎంపీపీ, కో ఆప్షన్ మెంబెర్ ఎన్నిక జరగనుంది. మరో పక్క ఐదు పంచాయతీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంలో అభ్యర్థులకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న అధికారులకు ఒకే ప్రాంగణంలో నామినేషన్ల స్వీకరణ, రూరల్ ఎంపీపీ ఎన్నిక కార్యక్రమాలు అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనం అనే చెప్పవచ్చు.
భారీ పోలీస్ బందోబస్తు :
ఎంపీడీవో కార్యాలయంలో ఒకపక్క నామినేషన్ల స్వీకరణ మరోపక్క రూరల్ ఎంపీపీ ఎన్నిక ఉండటంతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
THANKS & REGARDS
DWARAKA.H
PH: 9705347341