BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు

Select Suryaa Now
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 20 కేంద్రాల్లో 107 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలతో పాటు 1,198 వార్డులకు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దాఖలు సమయంలో ఎదురైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అధికార యంత్రాంగం ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించింది. నామినేషన్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. అభ్యర్థితో పాటు ప్రతి పాదకుడిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించారు. గుంపులుగా వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో నామినేషన్‌ కేంద్రాల వద్ద ఎలాంటి గందరగోళానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడక్కడా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల అవగాహన లోపం అభ్యర్థులకు ఇబ్బందులను కలిగించింది. చెక్‌లిస్టులు సక్రమంగా అందించకపోవడం, అభ్యర్థి సంతకం తమ సమక్షంలోనే చేయాలంటూ పట్టుబట్టడం, ముందే∙సంతకం చేసి తీసుకొచ్చిన నామినేషన్‌ పత్రాలను స్వీకరించకపోవడం వంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు సంబంధిత ఆర్వోలతో మాట్లాడి నిబంధనల ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి దుర్గసముద్రం, తిరుచానూరు, బ్రాహ్మణపట్టు, చెర్లోపల్లి నామినేషన్‌ కేంద్రాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులను అభినందించారు. 
చెవిరెడ్డి సుడిగాలి పర్యటన
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నామినేషన్ల తొలి రోజున తమ అభ్యర్థుల్లో ధైర్యం నింపడానికి నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. న్యూమంగళం, పద్మావతీపురం, తిరుచానూరు, బ్రాహ్మణపట్టు, సి.రామాపురం, దుర్గ సముద్రం, చంద్రగిరి, పాకాల, దామలచెరువు, మొగరాల, చిన్నగొట్టిగల్లు, భాకరాపేట, ఎర్రా వారిపాలెం నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో నిలుస్తున్న అభ్యర్థులను పలకరించి ధైర్యం చెప్పారు. ఈ నామినేషన్ల దాఖలులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వోల తీరుపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత స్థానిక సంస్థల ఎన్నికల అనుభవాల నేపథ్యంలో ఈ సారి నామినేషన్ల ప్రక్రియపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముందస్తు చర్యలు, పోలీసుల పటిష్ట బందో బస్తుతో చంద్రగిరి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. 
నామినేషన్లకు నవమి ఎఫెక్ట్‌..
నామినేషన్ల స్వీకరణలో తొలిరోజున నవమి కావడం, మరో రెండు రోజులు నామినేషన్లకు సమయం వుండటంతో చాలా మంది అభ్యర్థులు దశమి, ఏకాదశి గడియల్లో గురు, శుక్రవారాల్లో తమ నామినేషన్లు దాఖలు చేయడానికి ఆసక్తి చూపించారు. దీంతో చాలా చోట్ల నామినేషన్లుపై నవమి ఎఫెక్ట్‌ పడినట్టయ్యింది.

H. Dwaraka staff reporter 

9705347341