BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ

Select Suryaa Now
వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ

 

ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున 3 లక్షలు సొంత నిధుల ఆర్థిక సాయం

ఎస్.రాయవరం, నవంబర్ 18, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామ సమీపంలోని వరాహ నదిలో మూడు రోజుల క్రితం ముగ్గురు యువకులు మృతి చెందిన విషాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పెనుగొల్లు గ్రామానికి స్వయంగా వెళ్లిన హోంమంత్రి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వరాహ నదిలో గల్లంతై మృతి చెందిన కాతేటి రిషి (18), ముప్పిడి వంశీ (20), కోడి గణేశ్ (20) చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.యువకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష చొప్పున తన సొంత నిధుల నుంచి మొత్తం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పార్టీ ఎస్ రాయవరం మండలఅధ్యక్షులు అమలకంటి అబద్దం, పార్టీ శ్రేణులు వున్నారు.