BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు

Select Suryaa Now
ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్  ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు

 

రావికమతం నవంబర్ 18 మేజర్ న్యూస్:  లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించి ఎమ్మార్పీ  కన్నా అదనంగా  బాటిల్ కు  పది రూపాయలు  అధికంగా అమ్ముతున్నారని ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చే మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ దోపిడిని అరికట్టాల్సిన అధికారులు  చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో   దుకాణదారులు  బరితెగిస్తున్నారని టాక్స్ ప్లేయర్స్ మండిపడుతున్నారు. అధిక ధరలపై  మీడియాలో కథనాలు వచ్చిన సందర్భంలో తుతూ  మంత్రంగా తనిఖీలు జరిపి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. మరొకవైపు  షాపు పరిధిలో ఉన్న గ్రామాలలో సందు సందులో  బెల్ట్  షాపులు ఏర్పాటుచేసి   మద్యం  ఏరులై పారెందుకు దారులు తెరుస్తున్నారు. ఈ బెల్ట్ షాపులో  ఎమ్మార్పీ కన్నా ప్రతి బాటిల్ పైన నిర్వాహకులు అదనంగా 20 రూపాయలు మద్యం ప్రియుల నుంచి  ముక్కు పిండి వసూలు చేస్తున్నారు . ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఖజానాకు ఆదాయం  సమకూర్చుతున్న తమ బాధలు  ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై  త్యాగమూర్తులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.