నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు
వివరాలు వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె గఫూర్
నర్సీపట్నం నవంబరు 18 మేజర్ న్యూస్:
న్యాయస్థానం పేరుతో నకిలీ విడుదల వారెంట్, న్యాయమూర్తి సంతకం మరియు అధికారిక ముద్రను ఫోర్జరీ చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్*
చేసినట్లు నర్సీపట్నం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె గపూర్ తెలిపారు.వివరాలు ప్రకారం తేదీ 12.11.2026న నర్సీపట్నం అదనపు సివిల్ జడ్జి కోర్టు జూనియర్ డివిజన్ పరిధిలో, కొటవురట్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎన్ డి పి ఎస్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఏ-1 నరేష్ రాజు శ్రీధరన్‌ను విడుదల చేయించాలనే ఉద్దేశంతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ రిలీజ్ వారెంట్, బాండ్ మరియు బెయిల్ వారెంట్‌లను తయారుచేసి, న్యాయమూర్తి సంతకం మరియు కోర్టు అధికారిక ముద్రను ఫోర్జరీ చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలు అధికారులకు పంపించారు. అయితే, సదరు పత్రాలపై అనుమానం వచ్చిన సెంట్రల్ జైలు అధికారులు వాటి నిజానిజాలను నిర్ధారించుకోవడానికి సంబంధిత కోర్టుకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని పరిశీలించిన కోర్టు అధికారులు సదరు పత్రాలు నకిలీవని నిర్ధారించారు. అనంతరం, తేదీ 13.11.2026న కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంబందిత సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసులో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి, సెంట్రల్ జైలు మరియు వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, ఈ నేరంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ముగ్గురు నిందితులు:
1. సంపదరావు రవికుమార్ @ రవి – స్టెనోగ్రాఫర్, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు, నర్సీపట్నం.
2. మండల అనురాధ – అడ్వకేట్, జిల్లా కోర్టు, విశాఖపట్నం (సదరు NDPS కేసులో బెయిల్ అడ్వకేట్).
3. రిక్కి విప్లవమూర్తి @ ఆకాష్ – మండల అనురాధ భర్త.
పై ముగ్గురు నిందితులను తేదీ 17.11.2026న అరెస్ట్ చేసి, తదుపరి రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది.