BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ

Select Suryaa Now
రాష్ట్రస్థాయి  అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్  ఛాంపియన్ గా పృద్వి మణికంఠ

 

నర్సీపట్నం లో  7వ తరగతి చదువుతున్న పృథ్వి మణికంఠ  


నర్సీపట్నం , నవంబర్ 18 మేజర్ న్యూస్:
తిరుపతి వేదికగా జరిగిన  రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రామారావు పేటకు చెందిన యలమంచిలి  పృద్వి మణికంఠ ఛాంపియన్ గా నిలిచి తన సత్తా చాటాడు. చిత్తూరు జిల్లా తిరుపతిలో  ఈనెల  14 నుండి 17 వరకు చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన యానెక్స్- సన్ రైజ్ ఏపీ రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలలో  పృద్వి మణికంఠ  సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి  ఛాంపియన్ గా నిలిచాడు. అంతేకాక డబల్స్ విభాగంలో విశాఖపట్నం క్రీడాకారునితో కలిసి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. స్థానిక ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న పృద్వి మణికంఠ బాల్యం నుండి బ్యాడ్మింటన్ క్రీడ పట్ల ఆసక్తితో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో  బ్యాడ్మింటన్ క్రీడలో   శిక్షణ  పొందారు. తమ ప్రాంతానికి చెందిన బాలుడు రాష్ట్రస్థాయిలో బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా ఎదగడం పట్ల  నర్సీపట్నం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  కాగా రాష్ట్రస్థాయి ఛాంపియన్ గా నిలిచిన  పృద్వి మణికంఠను పట్టణ ప్రముఖులతోపాటు   "జాప్" యూనియన్ రాష్ట్ర  కార్యదర్శి యలమంచిలి వేణు ప్రత్యేకంగా అభినందించారు.