ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు...
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తిరుపతి రూరల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతుండటంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నగర పరిధిలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం నుంచి రూరల్ మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా పోలీసుల అవగాహన రహిత్యంతో ప్రజలు రాకపోకలు కొనసాగించే ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఇరువైపులా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించాల్సి ఉండగా, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ సుమారు 200 మీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో నివసించే వారు, వ్యాపారులు, వాహనదారులు, అత్యవసర పనులపై వెళ్లే నగరవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాన రహదారిలో ఉండే బారికేడ్లను తొలగించాలి
రూరల్ మండల పరిషత్ కార్యాలయం వెళ్లే దారిలో మాత్రమే బారికెడ్ల ను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. రోడ్డుకు ఇరువైపులా వేసిన బారికేడ్లను ను గురువారం నాటికైనా తొలగిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండదు
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లు చేయడం అవసరమే అయినప్పటికీ, అందుకు నగర ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ముఖ్యంగా కార్యాలయ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, వ్యాపార సంస్థలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఎన్నికల నిర్వహణ ఒకవైపు.. నగర ప్రజల ఇబ్బందులు మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు స్పందించి బారికేడ్ల పరిధిని నిబంధనలకు అనుగుణంగా కుదించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు, ఎంఆర్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
H. Dwaraka, staff reporter
9705347341