ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం
తిరుపతి, మేజర్ న్యూస్ :
నగరంలోని 16వ డివిజన్ పరిధిలో ఎస్వీ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా ఆ డివిజన్ కార్పొరేటర్ నాగభూషణం, ఆమె భర్త టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామదాసు
ముని రామయ్య దృష్టి సారించారు. బుధవారం ఎస్ వి నగర్ లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాగునీటి సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ అధికారులతో పర్యటించి చర్యలు చేపట్టారు. కార్పొరేటర్ ఆర్ నాగభూషణం ముని రామయ్య లు దగ్గరుండి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడంతో స్థానిక ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న టిడిపి నేతలు శ్రీనివాసులు, బాబు రెడ్డి, జీవరత్నం పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter
PH.NO:9705347341