BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

హనుమకొండ, మేజర్ న్యూస్, అర్హతే ప్రామాణికంగా, కులం, మతం, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి లు  స్పష్టం చేశారు. ప్రజాపాలనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కొత్తగా అర్హత పొందిన 2,698 మంది లబ్ధిదారులకు చేయూత ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలను ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడ చైర్మన్  గుండు సుధారాణి, ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక,జిల్లా కలెక్టర్  చాహత్ బాజ్‌పాయ్ ఐఏఎస్, కమిషనర్ వెంకన్న నాయక్, డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సంక్షేమ పథకాల కోసం ప్రజలు ప్రజాప్రతినిధుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అధికార యంత్రాంగమే నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు మంజూరు చేసే విధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
కానీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డివిజన్‌కు కేవలం పది పెన్షన్లు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పరిమిత సంఖ్యలో పెన్షన్లు ఇచ్చి ప్రజల అవసరాలను పట్టించుకోలేదని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల విషయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఒకే రోజు 2,698 మందికి పెన్షన్ల మంజూరు పత్రాలు అందించడం ప్రజాపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని భరిస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయని వివరించారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అర్హులైన మిగతా లబ్ధిదారులకు కూడా దశలవారీగా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒకేసారి మంజూరు చేయడం సాధ్యం కాదని, అర్హత ఆధారంగా విడతలవారీగా అందిస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే విధానాన్ని కూడా వివరించారు. పేదల గృహ అవసరాలను తీర్చేందుకు కొత్తగా టవర్స్ నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టామని తెలిపారు. పెన్షన్ల మంజూరులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లేదా ఇతర పార్టీలకు చెందిన వారనే తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.లబ్ధిదారుల నుంచి పెన్షన్లు లేదా ఇతర సంక్షేమ పథకాల మంజూరు కోసం ఎవరైనా ఒక్క రూపాయి డిమాండ్ చేసినా సహించేది లేదని హెచ్చరించారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హులైన ప్రజలకు చేరాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే తన క్యాంపు కార్యాలయానికి లేదా స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు ఎన్నికల సమయంలో డబ్బు, ప్రలోభాలకు లొంగకుండా తమ జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే నాయకులను గుర్తించి ఆదరించాలని కోరారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోవద్దని, తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
ఇప్పటికే పెన్షన్లు మంజూరైన వారితో పాటు ఇంకా అర్హత ఉండి పెన్షన్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్యాంపు కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం లేదా మున్సిపల్ అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకువస్తే పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజులు ఆలస్యమైనా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

రిపోర్టర్; రమేష్, హనుమకొండ, హనుమకొండ జిల్లా