BREAKING
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు

మహబూబాబాద్ సూర్య ప్రతినిధి, మేజర్ న్యూస్,ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పథకం అమలు తీసుకోవలసిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేయబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం జరుగుతుందని,నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీగా 
ఈ పథకం అమలుకు చర్యలు పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు ప్రభుత్వం సూచించిన విధంగా జీవిత బీమాను అమలు చేయాలని, ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు సవివరంగా క్లుప్తంగా అందరికీ వివరించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా విస్తృత ప్రచారం కల్పించి, క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరు ఎప్పుడూ హాజరు అయ్యేవిధంగా రూట్ మ్యాప్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని,ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఏర్పడితే సంబంధిత మున్సిపల్, ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యాలయలలో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు కోసం ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందని, తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం,  డిఆర్ఓ నాగలక్ష్మి, డిపిఓ రేవంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ,గొడుగు శీను ,మహబూబాద్ మహబూబాద్ జిల్లా