జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి
మహబూబాబాద్ సూర్య ప్రతినిధి, మేజర్ న్యూస్,వర్కింగ్ జర్నలిస్ట్ లు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని నాన్చివేత వైఖరి అవలంబించకుండా త్వరితగతిన జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్రప్రధానకార్యదర్శి రాంనారాయణ అన్నారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరించాలని ఇటీవలే యూనియన్ రాష్ట్ర నాయకత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ప్రత్యేకంగా కలవడం జరిగిందన్నారు. జర్నలిస్ట్ ల చిరకాలవాంచగా ఉన్న ఇంటిస్థలాల సమస్యను పరిష్కారించాలని గట్టిగా అడగడం జరిగిందని రాంనారాయణ అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు, త్వరలోనే అక్కడ పూర్తి చేసి వెంటనే అన్ని జిల్లాలోనూ ఈ సమస్యను పరిష్కారిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారని రాంనారాయణ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చేసిన సానుకూల ప్రకటనపై తమ సంఘ కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ప్రక్రియను వేగవంతం చేసి జర్నలిస్ట్ లలో నెలకొన్న ఆందోళనకు తెరదించాలని
కోరినట్లు తెలిపారు. అలాగే మరో ప్రధాన సమస్య అయిన ఆరోగ్య పథకాన్ని అమలు చేసి, జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల ప్రాణాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ డిమాండ్ చేశారు.మహబూబాబాద్ జిల్లా శాఖ సేవలు భేష్ అన్నారు.జర్నలిస్ట్ లకు వారి కుటుంబసభ్యులకు ఏ ఆపదవచ్చిన మహబూబాబాద్ జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) యూనిట్ స్పందించే తీరు అత్యంత అభినందనీయమని., రాష్ట్రంలోని అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ ప్రశంసించారు. టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ ను ఈఅంశంలో ప్రత్యేకంగా అభినందించాలని ఎంతోమంది జర్నలిస్ట్ లకు వారి నాయకత్వంలో సహాయం అందిందని ఇటీవల కూడా ఓ జర్నలిస్ట్ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే రూ.65వేలు అందజేసారని ప్రశంసించారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను మహబూబాబాద్ జిల్లా యూనిట్ నిర్వహించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ ప్రోత్సహించారు. డిసెంబర్ నెలలో టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా తృతీయ మహాసభ జరుగుతుందని రాంనారాయణ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, రాష్ట్రకౌన్సిల్ సభ్యులు వేణు, గందసిరి రవి, టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లాప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లా కోశాధికారి వెంకటరమణ, ఉపాధ్యక్షుడు ఉమ్మగాని మధు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లాప్రదానకార్యదర్శి రంగాచౌదరి, ఖమ్మం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; గొడుగు శ్రీనివాస్, మహబూబాబాద్ ,మహబూబా జిల్లా