BREAKING
ప్రోటోకాల్ విహదంతో నిలిచిన చేయూత పెన్షన్ల పంపిణీ గండి యాకయ్య చిత్రపటానికి నివాళులు పేదల సంక్షేమానికి పెద్ద పీట జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు...

పేదల సంక్షేమానికి పెద్ద పీట

Select Suryaa Now
పేదల సంక్షేమానికి పెద్ద పీట

కొత్తగూడ, మేజర్ న్యూస్, పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క, మండల పరిధిలోని 391 మంది నూతన లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేకంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తరతరాలుగా కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికులు, నేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గంగారం, కొత్తగూడ మండలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె భరోసా ఇచ్చారు.రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ. 73 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాల పేరిట ఆర్టీసీ బస్సులను కేటాయిస్తున్నామని తెలిపారు. గత మేడారం మహాజాతర సందర్భంగా మహిళా సంఘాలకు రూ. 3 కోట్ల ఆర్థిక సాయం అందిస్తే, వారు తమ వ్యాపార నైపుణ్యంతో ఏకంగా రూ. 10 కోట్ల లాభాలను ఆర్జించి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ మహాదేవునిగూడెంలో ఇప్ప పువ్వు లడ్డు తయారీ వంటి యూనిట్లకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి రూ. లక్ష ఆర్థిక సహాయం (రుణమాఫీ/సబ్సిడీ రూపంలో) అందిస్తున్నామన్నారు. అలాగే రేపు దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (ఇందిరమ్మ) జయంతిని పురస్కరించుకుని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వర్తించే విధంగా వినూత్న బీమా పథకాన్ని అమలులోకి తెస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.గత పాలనకు భిన్నంగా నేడు పూర్తి పారదర్శకమైన పాలన సాగుతోందని, పేదలకు ఇళ్లు గానీ, పింఛన్లు గానీ మంజూరు కావడానికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి తేల్చి చెప్పారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రజలందరూ ఒక సామాజిక బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందుకున్న లబ్ధిదారులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, స్థానిక సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ, ఎంపీడీవో అనురాధ, తహసిల్దార్ రాజు,  ఆర్ ఐ 
పరమేశ్వర్, తెలంగాణ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బానోత్ రూప్ సింగ్,మాజీ  మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, కొత్తగూడ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి, నోముల ప్రశాంతి యాదవ్, చొప్పరి కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ మరియు మండల స్థాయి అధికారులు, సర్పంచ్ లు మహిళా సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్; దేశ వెంకన్న, కొత్తగూడ, మహబూబాద్ జిల్లా