గండి యాకయ్య చిత్రపటానికి నివాళులు
దేవరుప్పుల , మేజర్ న్యూస్, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి చాటుకున్నారు. దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త గండి యాకయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా యాకయ్య నివాసానికి వెళ్లిన ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. యాకయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీఆర్ఎస్ పార్టీ జనగామ నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి మండల ముఖ్య నాయకులు ఏల సుందర్ గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటిపెళ్లి మహేష్ నాయకులు అనంతోజు కృష్ణమూర్తి దుబ్బాక రత్నాకర్ రెడ్డి నక్క రమేష్ సులుగూరి మహేష్ కాశబోయిన నాగేష్ మండల యూత్ అధ్యక్షుడు బానోతు నవీన్ నాయక్ గ్రామ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; ఎల్లేష్, దేవరుప్పుల, జనగామ జిల్లా