కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం
కేసముద్రం, మేజర్ న్యూస్, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే రాష్ట్రంలోని నిరుపేద ప్రజల కలలు సాకారం అవుతున్నాయని మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. కేసముద్రం మున్సిపల్ కేంద్రంలోని హరిహర గార్డెన్ లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మండలంలోని లబ్ధిదారులైన 1050 మంది దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలు, కల్లుగీత కార్మికులకు ఎమ్మెల్యే మురళి నాయక్ పింఛన్ మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ.. నిరుపేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి కృషితో కేసముద్రం మునిసి పాలిటీతో పాటు మండలంలో రూ.500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎంపీ వేం నరేందర్ రెడ్డి కృషితో కేసముద్రంలో ఇప్పటికే పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు, 50 పడగల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు, విద్యార్థులకు అల్పా హారం అందించే సెంట్రల్ కిచెన్, మున్సిపల్ కేంద్రంలో రోడ్ వైడనింగ్ పనులు, సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మానుకోట నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి, అమలు కాని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు అవుతుంటే ప్రతిపక్షాలు చూసి తట్టుకోలేక పోతున్నాయని ఎమ్మెల్యే మురళి నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు, కేసముద్రం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు,ఎంపీఓ హరీష్, జిల్లా ఆర్టీఏ సభ్యులు రావుల మురళి, సింగిల్ విండో వైస్ చైర్మన్లు అల్లం నాగేశ్వర్ రావు, అంబటి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు తరాల వీరేష్ యాదవ్, ధరావత్ కిషోర్, వల్లందాసు ఉమా రవి, బానోత్ విజయ బద్య, ఆగే రాము, పాయిరాల శరత్ యాదవ్, మేకల శారద సురేష్, రావుల వినయ్ రెడ్డి, జాటో సుజాత హరీష్ నాయక్, బానోత్ అరుణ దేవేందర్, దూడపాక కృష్ణ, సీనియర్ నాయకులు నీలం దుర్గేష్, గుగులోత్ దస్రూ నాయక్, బండారు వెంకన్న, బానోత్ వెంకన్న, మార్కెట్ డైరెక్టర్లు మహమ్మద్ అయూబ్ ఖాన్, ఓలం రమేష్, దామర కొండ ప్రవీణ్ కుమార్, చిల్లంచర్ల సతీష్ తోపాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనుల కార్యక్రమంలో భాగంగా కేసముద్రం విలేజ్ లో పూర్తిస్థాయి లో ఇండ్లు కోల్పోయిన నిరాశ్రయులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపల్ కేంద్రంలోని హరిహర గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసముద్రం విలేజ్ లో పూర్తిస్థాయిలో ఇల్లు కోల్పోయిన 40 మంది నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను ఎమ్మెల్యే మురళి నాయక్ చేతుల మీదుగా అందజేశారు.
రిపోర్టర్; వెంకన్న, మహబూబాబాద్, మహబూబాద్ జిల్లా