BREAKING
ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ

పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు

Select Suryaa Now
పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు

పరకాల, మేజర్ న్యూస్, పరకాల పట్టణంలోని ప్రస్తుత శ్మశాన వాటికను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ముందుకు వస్తున్నట్లు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, బి.ఆర్.ఎస్. ఉప సభాపక్ష నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ నెల 5వ తేదీన జరిగిన పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు పరకాల పట్టణంలోని శ్మశాన వాటికను ఆధునీకరించి, అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన, ఆధునిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులను పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆదర్శ శ్మశాన వాటికగా వైకుంఠ ధామం నిర్మించినట్లు తెలిపారు. అదే తరహాలో పరకాల పట్టణంలోని శ్మశాన వాటికను కూడా ఆధునీకరించి, అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పరకాల మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాస్తూ, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు వరంగల్‌లోని 57వ డివిజన్‌లో నిర్మించిన వైకుంఠ ధామాన్ని సందర్శించి, అక్కడ కల్పించిన సౌకర్యాలను పరిశీలించాలని కోరారు. అనంతరం పరకాల శ్మశాన వాటికలో చేపట్టాల్సిన ఆధునీకరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర అంచనా వ్యయ ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
తాను పూర్వపు పరకాల మండలంలోని వరికోల్ గ్రామానికి చెందినవాడినని, ఈ ప్రాంతంతో తనకు ఉన్న అనుబంధం, ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యతతో ప్రజా సంక్షేమ కార్యక్రమంగా ఈ పనులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అధికారులు వీలైనంత త్వరగా అంచనా వ్యయ ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పిస్తే, పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా అవసరమైన నిధులు సమకూర్చి, పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

రిపోర్టర్: బి సుజాత, పరకాల, హనుమకొండ జిల్లా