గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో బుధవారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సాహిత్య సదస్సు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గ్రంథాలయాల అభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. గత ఐదు రోజులుగా ప్రతిరోజూ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే నేడు సాహిత్య సదస్సు నిర్వహించి సాహితీవేత్తలను సత్కరించుకోవడం జరుగుతోందని చైర్మన్ తెలిపారు.అనంతరం సాహితీవేత్తలు సోము ఉమాపతి, నడ్డి గంగారాయణను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ గ్రంథాలయ అధికారి ధనంజయులు, సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ ముని లక్ష్మి, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్