పేద విద్యార్థిని చదువుకు అండగా మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్, మేజర్ న్యూస్: చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు సుభాష్ నగర్ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థిని చదువుకు అవసరమైన ల్యాప్‌టాప్ లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన, తన సొంత ఖర్చులతో రూ.30 వేల విలువైన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసి విద్యార్థినికి అందజేశారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ… పేద విద్యార్థులకు చదువులో సహాయ సహకారాలు అందించడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడకూడదని, తనకు చేతనైనంత వరకు పేద విద్యార్థులకు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు.ల్యాప్‌టాప్ అందుకున్న విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు అర్థ సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.