BREAKING
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ హ్యాండ్ బాల్ విజేతగా ఎస్వీయూ కళాశాల నిబంధనలు గాలికి.. జనావాసాల మధ్యే వైన్‌షాప్‌! సిగ్నల్‌ లేక.. సేవలు సాగక! విద్యార్థుల స్కాలర్షిప్ సంగతేంటి...సారూ...! -ఫీజులతో సంబంధం లేకుండా సర్టీఫికేట్లు ఇవ్వాల్సిందే.. స్పందన బాధిత కుటుంబానికి అందిన రేషన్‌! పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి... ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం రట్టిణిలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి *నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా? బోయిన రమేష్ దంపతులకు ప్రజల బ్రహ్మరథం అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..

పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల...

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల...


- డిసెంబర్ 2న పోలింగ్..
-  అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి.
- ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ.

నరసన్నపేట నవంబర్ 18 మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని నరసన్నపేట గ్రామ పంచాయతీకి డిసెంబర్ 2వ తేదీన (బుధవారం) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల కార్యక్రమానికి సంబంధించిన వివరాలను గ్రామ పంచాయతీ డిప్యూటీ ఎంపీడీవో కమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిల్లా జగన్ మోహనరావు వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

* నవంబర్ 19: రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్.

* నవంబర్ 21: రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు జారీ.

* నవంబర్ 23: నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.

* నవంబర్ 24: నామినేషన్ల పరిశీలన.

* నవంబర్ 25: తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశం.

* నవంబర్ 26: అప్పీళ్ల పరిష్కారం.

* నవంబర్ 27: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

* డిసెంబర్ 2: పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

* డిసెంబర్ 3: అవసరమైతే రీపోలింగ్.
నరసన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని అర్హులైన ఓటర్లందరూ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిల్లా జగన్ మోహనరావు కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత ఎన్నికల సిబ్బంది రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.