BREAKING
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ హ్యాండ్ బాల్ విజేతగా ఎస్వీయూ కళాశాల నిబంధనలు గాలికి.. జనావాసాల మధ్యే వైన్‌షాప్‌! సిగ్నల్‌ లేక.. సేవలు సాగక! విద్యార్థుల స్కాలర్షిప్ సంగతేంటి...సారూ...! -ఫీజులతో సంబంధం లేకుండా సర్టీఫికేట్లు ఇవ్వాల్సిందే.. స్పందన బాధిత కుటుంబానికి అందిన రేషన్‌! పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి... ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం రట్టిణిలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి *నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా? బోయిన రమేష్ దంపతులకు ప్రజల బ్రహ్మరథం అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..

Select Suryaa Now
లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..


- సివిల్ కేసులు రాజీపడితే కోర్టు ఫీజు వాపసు
-  జూనియర్ సివిల్ జడ్జి రోషిణి

​కోటబొమ్మాళి, నవంబరు 18, మేజర్ న్యూస్: డిసెంబరు 12వ తేదీన స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం చేకూరుతుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోషిణి పిలుపునిచ్చారు. బుధవారం కోటబొమ్మాళి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో స్థానిక న్యాయవాదులు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నౌపడ పోలీస్ సిబ్బందితో పాటు బ్యాంకు అధికారులతో ఆమె వేర్వేరుగా సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రోషిణి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో ఇరుపార్టీల పరస్పర అంగీకారంతో సివిల్ కేసులు పరిష్కారమైతే కక్షిదారులు చెల్లించిన కోర్టు ఫీజును పూర్తిగా వాపసు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

​రాజీకి అనుకూలమైన అన్ని రకాల క్రిమినల్, సివిల్ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. లోక్ అదాలత్‌లో వెలువడే తీర్పే అంతిమ తీర్పు అని, దీనికి ఎటువంటి అప్పీలు ఉండదని, తద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు. ఈ సమావేశాల్లో స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లఖినేని శ్రీనివాసులు, ఏజీపీ పల్లి వాసుదేవరావు, పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.