ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం
∆. నేడు సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం
∆. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరుకావాలి
సంతబొమ్మాళి, నవంబర్ 18, మేజర్ న్యూస్ :
మండల పరిషత్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులందరూ పెద్దసంఖ్యలో హాజరుకావాలని సంతబొమ్మాళి మండల టీడీపీ అధ్యక్షులు, ఎంపీపీ సుగ్గు శాంతి స్వరూప రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నవంబర్ 19న సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమయానికి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన కోరారు.