కార్యకర్తలకు అండగా ఉంటా
ప్రాణం ఉన్నంత వరకు పార్టీని నమ్ముకున్న వారికి తోడుగా ఉంటా
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ
నక్కపల్లి:మేజర్ న్యూస్: పార్టీని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులకు ప్రాణం ఉన్నంత వరకు అండగా ఉంటానని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. బుధవారం నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ తన సోదరుడు వీసం నానాజీ టీడీపీలో చేరినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదన్నారు. వ్యక్తులు పార్టీ వీడినా కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ ముఖ్యమని పేర్కొన్నారు.
కుటుంబాల్లో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని మంత్రి అనిత ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి రాజకీయాలకు భయపడేది లేదన్నారు. నైతిక విలువలతో రాజకీయాలు చేస్తూ, ప్రజలు, కార్యకర్తల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. పదవులు, అధికారానికి భయపడి రాజకీయాలు చేయలేదని, తనను నమ్ముకున్న వారికి అండగా నిలుస్తానని తెలిపారు. వెన్నుపోటు రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.