BREAKING
గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్ కార్యకర్తలకు అండగా ఉంటా వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా వాడపర్తి లక్ష్మి నామినేషన్! ఎస్.రాయవరం ఎంపీపీ గా నల్లపరాజు వెంకటరాజు ప్రమాణ స్వీకారం నేడే! కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

Select Suryaa Now
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

 

ఎచ్చెర్ల, నవంబర్ 18 మేజర్ న్యూస్ :
శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు  కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల పటిష్టత, కౌంటింగ్ హాళ్లలో టేబుళ్ల ఏర్పాటు, బారికేడింగ్, నిరంతరాయ విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల నిఘా, అగ్నిమాపక చర్యలు, మీడియా సెంటర్ తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా జేసీ తనిఖీ చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు, మూడంచెల పోలీసు భద్రతపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్లు జి.శ్రావణ్ కుమార్, టి.రవి, సీఐలు సన్యాసినాయుడు, అవతారం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.