BREAKING
గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్ కార్యకర్తలకు అండగా ఉంటా వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా వాడపర్తి లక్ష్మి నామినేషన్! ఎస్.రాయవరం ఎంపీపీ గా నల్లపరాజు వెంకటరాజు ప్రమాణ స్వీకారం నేడే! కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

స్పందన బాధిత కుటుంబానికి అందిన రేషన్‌!

Select Suryaa Now
 స్పందన  బాధిత కుటుంబానికి అందిన రేషన్‌!

 

 వార్త ప్రచురితమైన వెంటనే స్పందించిన తహసీల్దార్‌
. హేమసుందర్‌రావు ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం
. వారం రోజుల నిరీక్షణకు తెర.. బాధిత కుటుంబానికి ఊరట!

సంతబొమ్మాళి, నవంబర్ 18, మేజర్ న్యూస్ :

ప్రభుత్వ జాబితాలో పేరు ఉన్నప్పటికీ వారం రోజులుగా రేషన్‌ సరుకుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద మత్స్యకార కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఈ సమస్యపై బుధవారం 'సూర్య దినపత్రిక లో ప్రచురితమైన 'జాబితాలో పేరున్నా.. చేతికి అందని సాయం!' కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.
మండలంలోని మేఘవరం పంచాయతీ పరిధి యంపల్లవానిపేట గ్రామానికి చెందిన యంపల్ల చిన్నారావు, దేవి దంపతులకు మురసు తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ సరుకులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సూర్య దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ కథనంపై సంతబొమ్మాళి తహసీల్దార్‌ హేమసుందర్‌రావు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి తక్షణమే రేషన్‌ సరుకులు అందించాలని సంబంధిత సిబ్బందికి, రేషన్‌ డీలర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు బుధవారమే బాధిత కుటుంబానికి రేషన్‌ సరుకులు అందజేశారు.
వారం రోజులుగా రేషన్‌ డిపో చుట్టూ తిరిగినా పట్టించుకోని సమస్య.. ఒక్క వార్తతో పరిష్కారం కావడంతో బాధిత కుటుంబం ఊరట చెందింది. తమ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చేసిన సూర్య దినపత్రికకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తే అధికార యంత్రాంగం స్పందించి పరిష్కారం చూపుతుందనేందుకు ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది.