హ్యాండ్ బాల్ విజేతగా ఎస్వీయూ కళాశాల
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్ కళాశాలల పురుషుల క్రీడల పోటీలలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో ఎస్వీయూ కళాశాల విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా వర్సిటీ జాయింట్ రిజిస్ట్రార్ చంద్రయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శివశంకర్ రెడ్డి, ఆంధ్రకేసరి వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీని, ప్రశంసాపత్రాలను అందజేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్