BREAKING
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ హ్యాండ్ బాల్ విజేతగా ఎస్వీయూ కళాశాల నిబంధనలు గాలికి.. జనావాసాల మధ్యే వైన్‌షాప్‌! సిగ్నల్‌ లేక.. సేవలు సాగక! విద్యార్థుల స్కాలర్షిప్ సంగతేంటి...సారూ...! -ఫీజులతో సంబంధం లేకుండా సర్టీఫికేట్లు ఇవ్వాల్సిందే.. స్పందన బాధిత కుటుంబానికి అందిన రేషన్‌! పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి... ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం రట్టిణిలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి *నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా? బోయిన రమేష్ దంపతులకు ప్రజల బ్రహ్మరథం అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..

పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి

Select Suryaa Now
పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి

 

 

మెలియాపుట్టి. నవంబర్ 18. మేజర్ న్యూస్...
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు వారిలో పఠనాసక్తి, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మెలియాపుట్టి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గ్రంథాలయ అధికారిణి ఆర్. అనురాధ పర్యవేక్షణలో ‘నేర్చుకోవడానికి చదవండి.. నాయకత్వం వహించడానికి నేర్చుకోండి’ అనే అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు, విజ్ఞాన సముపార్జన, వ్యక్తిత్వ వికాసం, సమాజాభివృద్ధిలో నాయకత్వ లక్షణాల పాత్ర వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తూ వక్తృత్వ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ-2 పద్మనాభం, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వైకుంఠరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విద్యార్థుల ప్రసంగాలను నిశితంగా పరిశీలించి వారి ప్రతిభను ప్రశంసించారు. పుస్తకాలు మనిషికి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తాయని, సమాజాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే పఠనాన్ని అలవాటుగా చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అలవడతాయని సూచించారు.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు సృజనాత్మకత, స్వీయ వ్యక్తీకరణ, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఈ. మాధవరావు, పి. రోజా, పి. మాధురీదేవి, కె. రమణమూర్తి, సంజయ్ కుమార్ నాయక్, వై. కృష్ణకుమారి, ఎస్. భాస్కరరావు, ఎన్. సంతోష్ కుమార్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.