BREAKING
గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్ కార్యకర్తలకు అండగా ఉంటా వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా వాడపర్తి లక్ష్మి నామినేషన్! ఎస్.రాయవరం ఎంపీపీ గా నల్లపరాజు వెంకటరాజు ప్రమాణ స్వీకారం నేడే! కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

*నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా?

Select Suryaa Now
*నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా?

 

*నీటిపారుదల శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

*నకిలీ పట్టాలపై విచారణ జరిపి.. ఆక్రమణలు తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి*

హిరమండలం, నవంబర్ 18 (మేజర్ న్యూస్):

ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి, నీటిపారుదల శాఖకు చెందిన భూముల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వంశధార నిర్వాసితుడు ఎద్దు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హిరమండలం మండలం కోరాడ రెవిన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 230-7Bలో ఉన్న మొత్తం 81 సెంట్ల నీటిపారుదల శాఖ భూమిలో సుమారు 10 సెంట్ల మేర ఆక్రమణకు గురైనట్లు ఆయన పాత్రికేయులకు వివరించారు. అంతేకాకుండా, కొందరు ఆక్రమణదారులు నకిలీ నిర్వాసితుల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి వాటి ఆధారంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు లోతైన విచారణ జరిపి పట్టాల ప్రామాణికతను నిర్ధారించాలని కోరారు. నిజమైన వంశధార నిర్వాసితుల హక్కులకు భంగం కలగకుండా, నకిలీ పత్రాలు ఉపయోగించినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల హద్దులను అధికారిక రికార్డుల ఆధారంగా గుర్తించి, ఆక్రమణలకు గురైనట్లు నిర్ధారణ అయిన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు తేలిన అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా సంబంధిత భూముల వద్ద ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి, అవి నీటిపారుదల శాఖకు చెందిన ప్రభుత్వ భూములని స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ, నీటిపారుదల శాఖలతో పాటు జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని, ఫిర్యాదులు, ఆరోపణలపై కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఎద్దు లక్ష్మీనారాయణ కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించి, ప్రజా ఆస్తుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.