రట్టిణిలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి
సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య దాఖలు.. 200 మందితో భారీగా తరలివెళ్లిన నాయకులు, గ్రామస్తులు
మెలియాపుట్టి. నవంబర్ 18. మేజర్ న్యూస్...
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెలియాపుట్టి మండలం రట్టిణి గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆశీస్సులతో ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.
జనసేన నాయకుడు చింతల ప్రశాంత్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు సుమారు 200 మంది ఒకేచోట చేరి నామినేషన్ కేంద్రానికి తరలివెళ్లారు. సర్పంచ్ అభ్యర్థి చింతల దివ్యతో పాటు వివిధ వార్డులకు కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులతో కలిసి నామినేషన్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎమ్మెల్యే ఆశీస్సులు, స్థానిక నాయకుల సమన్వయంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేపట్టారు.