BREAKING
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు చదవండి నాయకత్వం వహించండి ఎమ్మెల్యే హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Select Suryaa Now
రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

 

వరంగల్ సిటీ, మేజర్ న్యూస్,
ఖాజీపేటలో త్వరలో ప్రారంభం కానున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదాల నివారణకు పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న సూచించారు. బుధవారం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యాక్టరీ ప్రారంభానికి ముందే అన్ని భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం హన్మకొండ లోని కాళోజీ కళాక్షేత్రం, అంబేద్కర్ భవన్‌లలో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశీలనల్లో బల్దియా ఫైర్ సేఫ్టీ అధికారి రాజేశ్వర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సంతోష్ , వరంగల్ ,వరంగల్ జిల్లా