ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి
- ప్రిసైడింగ్ అధికారి బి బి మిశ్రా
సీతంపేట సూర్య: సీతంపేట మండలాధ్యక్షుల పదవి కి ఎన్నిక నేడు (గురువారం) జరగనుంది. ఎంపీటీసీ లుగా ఎన్నికైన సభ్యులంతా హాజరు కావాలని ప్రిసైడింగ్ అధికారి బి బి మిశ్రా బుధవారంతెలిపారు.ఇప్పటికే వై ఎస్ ఆర్ తరుపున తొమ్మిది మంది,జనసేన తరుపున ఆరుగురు ,టీడీపీ తరుపున ఒకరు గెలుపొందారు. ఎంపీటీసీ సభ్యులు చేతులు ఎత్తి ఎంపీపీని ఎన్నుకుంటారని మిశ్రా స్పష్టం చేసారు. అయితే ఎంపీపీ గా మహిళలకు కేటాయించారు. ముగ్గురు మహిళలు పోటీలో ఉన్నారు. ఎస్ లక్ష్మీ గతంలో ఎంపీపీగా చేసిన అనుభవం ఉంది. మాజీ ఎమ్మెల్యే వి కళావతి ఆధ్వర్యంలో ఎంపీపీ , వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు ఎంపిక జరగనుందని సీతంపేటలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా సవర వర్గానికే ఎంపీపీ పదవి దక్కనుంది.