విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు
- గరుగుబిల్లి శాఖ గ్రంథాలయంలో ఘనంగా
- పాఠశాల స్థాయి నుంచే పఠనాసక్తిని పెంపొందించుకోవాలి
- గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు
గరుగుబిల్లి, సూర్య: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని,తద్వారా వారిలో దాగి ఉన్న సృజనాత్మకత మరియు ఆలోచన శక్తి పెరుగుతాయని గరుగుబిల్లి శాఖ గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధు సూదనరావు పేర్కొన్నారు.శాఖా గ్రంధా లయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శాఖ గ్రంథాలయంలో ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల విద్యార్థు లకు వ్యాసరచన పోటీలను నిర్వహిం చారు.ఈపోటీల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా శాఖా గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, గ్రంథాలయాల్లోని విజ్ఞానదాయకమైన పుస్తకాలను చదవడం ద్వారా జనరల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలని సూచించా రు.వ్యాసరచన వంటి పోటీలు విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని తెలిపారు.వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు రోజున బహుమతులు అందజేయను న్నామని మధుసూదనరావు పేర్కొ న్నారు.ఈకార్యక్రమంలో గురుకుల పాఠశాల గ్రంథాలయ అధికారి కోట మాధవి తదితరులు పాల్గొన్నారు.