BREAKING
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు చదవండి నాయకత్వం వహించండి ఎమ్మెల్యే హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా

జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా

Select Suryaa Now
జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంజాతీయస్థాయి కరాటే పోటీల్లో ధవళేశ్వరం డ్రీమ్స్ స్కూల్ విద్యార్థులు విజయ బావుటా ఎగురవేశారు. కాకినాడ ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన 5వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-2026లో డ్రీమ్స్ విద్యార్థులు 8 బంగారు పతకాలు,4 రజత,2 కాంస్య పతకాలతో పాటు బెస్ట్ స్కూల్ పెర్ఫార్మెన్స్ అవార్డును సాధించారు. కటా విభాగంలో పనస రేష్మనాయుడు, ఉండపల్లి దేవిసరయు, కరుకు అభిషేక్, కామిరెడ్డి లిఖిత వెంకట శ్రీ, తంపర చందన దీపిక, జనా వాగ్దేవి,నీలపల్లి రాకేష్ హర్ష, చిట్టిమల్ల రమ్యశ్రీ మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. గంగోలు భవానీ, వాసంశెట్టి పుష్పశ్రీ, చితిరాల కార్తీక, పోలవరపు జాహ్నవి దేవి ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని రజత పతకాలను సాధించారు. సోమిరెడ్డి నవ్యశ్రీ, భోగిరెడ్డి వీరమణికంఠ తృతీయ స్థానాన్ని సాధించి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. అన్నీ విభాగాల్లో డ్రీమ్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపడంతో డ్రీమ్స్ స్కూల్కు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రదానం చేశారు. జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయకేతనం ఎగురవేసిన విద్యార్థిని, విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ కె జానకిరాముడును డ్రీమ్స్ విద్యాసంస్థల చైర్మన్ అంగర రమేష్ అభినందించారు.