అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు..
- (ఐసిడిఎస్ పిఓ. సుచరిత ఆదిలక్ష్మి)
సాలూరు సూర్య: అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఇద్దరు కార్యకర్తలకు ఐసిడిఎస్ పిఓ. సుచరిత మెమోలు జారీ చేసినట్లు స్థానిక విలేఖర్లకు తెలియజేశారు. సికెండ్ సెక్టారు మెంటాడవీధి అంగన్వాడీ సెంటర్లో వున్న ముగిడ భవాని,మూడవ సెక్టారు తెలగావీధి అంగన్వాడీ కార్యకర్త అల్లు పద్మ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు , గర్భిణీ, బాలింతలకు గుడ్డు, పాలు బాల సంజీవని అందించే విషయంలో అవకతవకలు జరిగినట్లు దృవికరించి ఇరువురికి మెమోలు జారీ చేసినట్లు తెలియజేశారు. అలాగే మేధరవీధి, లావుడు వీధి, కొలగట్లవీధి, బంగారంపేట తదితర మెర్జ్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు వారి విధులను సక్రమంగా నిర్వహించలేనందున ఇదివరలో మెమోలు జారీ చేసినట్లు తెలియజేశారు.మెమోలు అందుకున్న వారందరూ వాల్ల పోరపాటుకు కారణాలు లిఖితపూర్వకంగా తెలియజెయ్యాల్సివుందని అన్నారు.