BREAKING
అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు..

గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి

Select Suryaa Now
గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి...  ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం..  టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి

తిరుపతి రూరల్,
మేజర్ న్యూస్ :
గాంధీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా తనను గెలిపిస్తే.. పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చి దిద్దుతాం అని టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి తెలిపారు. బుధవారం ఆయన మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ  గ్రామపంచాయతీలో ప్రజలందరి సహకారంతో టిడిపి మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని చెప్పారు. పంచాయతీ ప్రజలు తనను ఆదరించి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తే పంచాయతీలోని ప్రధాన సమస్యలను గెలిచిన ఆరు నెలల లోపే పరిష్కరించే దిశగా దృష్టిస్తారిస్తాం. ప్రధానంగా పంచాయతీలో ఉన్న నివాస గృహాలకు ఇంటి పన్నులు, విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఇప్పించడం బాధ్యతగా తీసుకుంటాం. పంచాయతీ పరిధిలోని అన్ని వీధులలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలను అండర్ డ్రైనేజ్ సిస్టం తీసుకువచ్చి పనులు చేపడతాం. ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా భావించి పరిష్కరించే  మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నని చెప్పారు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరిని సమన్వయం చేసుకొని ముందుకు వెళతానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో  ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ఎక్కువ నిధులు తీసుకువస్తానని చెప్పారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు జవాబు దారితనంగా పాలనను అందిస్తామని సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి చెప్పారు.

H. Dwaraka, staff reporter 

9705347341