వైఎస్ఆర్సిపి లోకి చేరికలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
మెర్లపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణతో ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. ఇందులో భాగంగా దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం కలిగి ఉన్న మెర్లపాలెం గ్రామానికి చెందిన ఇర్లపాటి నరసయ్య, టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ శాసనసభ్యులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో నరసయ్య పార్టీ కండువా కప్పుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి గారు ఆయనకు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. 40 ఏళ్ల రాజకీయ అనుబంధాన్ని పక్కనపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని, రానున్న రోజుల్లో మరింతమంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వైపు అడుగులు వేయనున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు.