పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం
సీతానగరం సూర్య: మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో ఎం ఎల్ ఎన్ ప్రసాద్ సూచించారు. ఈ మేరకు బుధవారం నాడు సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామపంచాయతీ ఎలక్షన్ సంబంధించి పిఓ పిఓలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ విధుల్ని ఓ పి ఓ విధులను కూడా సక్రంగా నిర్వహించి ఎన్నికలలో ఎటువంటి వివాదాన్ని లేకుండా విధులు నిర్వహించాలని ప్రతి మెటీరియల్ కౌంటింగ్ సెంటర్లో తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలని పిఓ డైరీ బ్యాలెట్ పేపర్స్ ఇంక్ బాటిల్ అని కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి రిసీవ్ చేసుకుని వెళ్లాలని అలాగే పంచాయతీ ఎలక్షన్ లో ఓటర్ కి ఎడమచేతి చిటికను వేళ్ళు కు ఇంకు పెట్టాలని తెలియజేయడం జరిగింది.ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల ప్రకటన తదితర అంశాలపై వివరించారు.ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్స్ పి. కూర్మి నాయుడు , పోలి నాయుడు, రాయి డి శంకర రావు. కే ఉమామహేశ్వరరావు శిక్షణ కార్యక్రమం సంబంధించిన ప్రతి విషయం వివరంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతులకు హాజరైన సిబ్బందితోపాటు డిప్యూటీ ఎంపీడీవో వర్మ పాల్గొన్నారు.