నాగ్సన్ పల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ పేదలకు భరోసాగా చేయూత పింఛన్లు
సదాశివపేట ; సదాశివపేట మండలం నాగ్సన్ పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాశిపురం రవికుమార్, ఉపసర్పంచ్ ప్రశాంత్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా పింఛన్లు పేద, వృద్ధ, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కే. రవి, శివకుమార్, సుమిత్ర, మంగమ్మ, నర్సింలు, సుధా, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.